జగిత్యాల ఆర్టీసీ బస్సులో మంటలు | TSRTC Bus Catches Fire In Jagtial | Sakshi
Sakshi News home page

జగిత్యాల ఆర్టీసీ బస్సులో మంటలు

Apr 28 2019 9:09 AM | Updated on Apr 28 2019 9:20 AM

TSRTC Bus Catches Fire In Jagtial - Sakshi

జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు ప్లాట్‌ఫాంపై సిద్ధంగా ఉన్న సూపర్‌ లక్సరీ బస్సులో శనివారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వెంటనే ఆర్టీసీ అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సకాలంలో స్పందించిన ఫైర్‌ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆ తర్వాత మరో బస్సు ఏర్పాటు చేసి ప్రయాణికులను శంషాబాద్‌కు పంపించారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే బస్సులో మంటలు చెలరేగినట్టు అధికారులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement