31న టీఎస్‌ ఐసెట్‌ ఫలితాలు | TS ICET results release on may 31 | Sakshi
Sakshi News home page

31న టీఎస్‌ ఐసెట్‌ ఫలితాలు

May 29 2017 7:31 PM | Updated on Sep 5 2017 12:17 PM

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌-2017 పరీక్ష ఫలితాలు..

► కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఓంప్రకాశ్‌ వెల్లడి

వరంగల్‌‌: తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను ఈనెల 18న నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌-2017 పరీక్ష  ఫలితాలు ఈనెల 31న విడుదల చేయనున్నట్టు టీఎస్‌ ఐసెట్‌ కన్వీనర్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఓంప్రకాశ్‌ సోమవారం వెల్లడించారు. ఈనెల 30వ తేదీనే ఫలితాలను విడుదల చేయాలని తొలుత షెడ్యూల్‌లో ప్రకటించామని, కానీ, ఈనెల 31న సాయంత్రం 4 గంటలకు హైదారాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేస్తామన్నారు.

 ఐసెట్‌ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 71,172 మంది విద్యార్థులు హాజరయ్యారని, ఈనెల 21న ప్రాథమిక కీ విడుదల చేసి 27వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించామన్నారు. 60 నుంచి 70 వరకు అభ్యంతరాలు వచ్చాయని ప్రొఫెసర్‌ ఓంప్రకాశ్‌ చెప్పారు. హైదరాబాద్‌లో బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ టిపాపిరెడ్డి, కేయూ వీసీ ప్రొఫెసర్‌ ఆర్‌.సాయన్న ఫలితాలు విడుదల చేస్తారని, అదేరోజు ఫైనల్‌ కీ  కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement