ముగిసిన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ భేటీ

TRS Parliamentary Party Meeting in Pragathi Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  పార్లమెంట్‌లో ఆందోళనల విషయంలో టీఆర్‌ఎస్‌ వెనక్కి తగ్గింది. స్పీకర్‌ నిర్ణయానికి అనుగుణంగా సభలో వ్యవహరించాలని నిర్ణయించింది. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ ఎంపీలు సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. సోమవారం ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో పార్లమెంట్‌లో పార్టీ అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాల గురించి చర్చిం‍చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో.. కేంద్రంపై వివిధ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు వస్తే పాల్గొనాలని పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్‌ సూచించారు. అలాగే అవిశ్వాసంపై ఓటింగ్‌ జరిగితే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలని సూచనలు చేశారు. ఈ భేటీలో ఎంపీలు కేశవరావు, జితేందర్‌ రెడ్డి, వినోద్‌ కుమార్‌, కవిత, బాల్క సుమన్‌, కొత్త ప్రభాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాగా రిజర్వేషన్ల పెంపు అధికారం రాష్ట్రాలకే కేటాయించాలంటూ పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. దీంతో లోక్‌ సభ సమావేశాలకు అంతరాయం కలగడంతో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండానే సభ వాయిదా పడుతూ వస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top