తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందుగానే ఆపరేషన్ ఆకర్ష్ను పూర్తి చేయాలనే యోచనలో టీఆర్ఎస్ ఉన్నట్లు సమాచారం. వి
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందుగానే ఆపరేషన్ ఆకర్ష్ను పూర్తి చేయాలనే యోచనలో టీఆర్ఎస్ ఉన్నట్లు సమాచారం. విపక్షాలను దీటుగా ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ ఇతర పార్టీల నేతలను ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగానే గత అయిదు నెల్లలో ఇతర పార్టీ ఎమ్మెల్యేలు పదిమంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దాంతో అసెంబ్లీలో ఆపార్టీ బలం 73కి పెరిగింది.
ప్రభుత్వం ఏర్పాటు సమయంలో టీఆర్ఎస్ బలం 63 ఉండగా, ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్, టీడీపీ, బీఎస్సీ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు ఆపార్టీలో చేరారు. బుధవారం తెలంగాణ టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ....టీఆర్ఎస్లో చేరగా తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా త్వరలోనే కారెక్కబోతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యాదయ్య, రెడ్యా నాయక్ ఈరోజు కేసీఆర్ను కలిసి తమ మద్దతు ప్రకటించారు. కాగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి మరిన్ని చేరికలు ఉండవచ్చనే ఊహాగానాలు వినిస్తున్నాయి.