'కిషన్రెడ్డివి ఉప ఎన్నిక రాజకీయాలు' | TRS MLAs takes on BJP Telangana state president Kishan Reddy | Sakshi
Sakshi News home page

'కిషన్రెడ్డివి ఉప ఎన్నిక రాజకీయాలు'

Aug 8 2014 2:01 PM | Updated on Mar 29 2019 5:32 PM

'కిషన్రెడ్డివి ఉప ఎన్నిక రాజకీయాలు' - Sakshi

'కిషన్రెడ్డివి ఉప ఎన్నిక రాజకీయాలు'

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షడు, ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి టీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న విమర్శలను ఆ పార్టీ ఎమ్మెల్యేలు బాలరాజు, దివాకర్రావులు తిప్పుకోట్టారు.

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షడు, ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి టీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న విమర్శలను ఆ పార్టీ ఎమ్మెల్యేలు బాలరాజు, దివాకర్రావులు తిప్పుకోట్టారు. శుక్రవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీపై కిషన్రెడ్డి అనుసరిస్తున్న వైఖరీపై మండిపడ్డారు. మెదక్ ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకుని ఆయన ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని... అయినా ఆయన ఏ రోజు స్పందించలేదని కిషన్ రెడ్డిపై వారు విరుచుకుపడ్డారు. తెలంగాణలో బేజేపీ ఉనికి కోల్పోతోందని తెలిపారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే అనవసరంగా కిషన్రెడ్డి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు బీజేపీని తిరస్కరిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాలరాజు, దివాకర్రావులు అన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement