టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి | TRS MLA Candidate Rajender Elections Campaign In Karimnagar | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి

Nov 22 2018 8:22 AM | Updated on Aug 27 2019 4:45 PM

TRS MLA Candidate  Rajender Elections Campaign In Karimnagar - Sakshi

ధర్మరాజుపల్లి గ్రామంలో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్‌

హుజూరాబాద్‌: గత ప్రభుత్వాల పాలనలో గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని, ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ ప్రభుత్వంలోనే అభివృద్ధికి నోచుకున్నాయని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం మండలంలోని ధర్మరాజుపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన మంత్రికి గ్రామస్తులు మంగళహారతులిచ్చి, డప్పుచప్పుళ్లు, బోనాలు, బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని చౌరస్తా వద్ద నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడారు. ధర్మరాజుపల్లి గ్రామం ధర్మం తప్పదని భావించి నియోజకవర్గంలో ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇచ్చిన హామీలతో పాటుగా, ఇవ్వని పనులను కూడా చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఆడబిడ్డ తల్లిదండ్రుల గుండెల్లో కుంపటి కావద్దనే ఆలోచనతో దేశంలోనే ఎక్కడాలేని విధంగా కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేశామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా వందశాతం డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని, హుజూరాబాద్‌లో ఇప్పటికే రూ.100 కోట్లతో పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో సొంత భూమి ఉన్న వారికి కూడా డబుల్‌బెడ్‌రూం ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజల ఉసురు పోసుకున్న టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూటమిగా కలిసి వస్తున్నాయని, మందు సీసాలు, డబ్బు మూటలతో వస్తున్న వారిపై అప్రమత్తంగా ఉండి, ప్రజల కోసం పని చేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతుగా నిలిచి మరోసారి తనను ఆశీర్వదించాలని వేడుకున్నారు.

అంతకుముందు మండలంలోని పెద్దపాపయ్యపల్లి గ్రామంలోని హనుమాన్‌ దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా.. మొదటి రైతుబంధు చెక్కును అందుకున్న రైతు మూగల సంజీవరెడ్డి మంత్రి ఈటల రాజేందర్‌కు ఎన్నికల ఖర్చు కోసం రూ.5 వేలు విరాళం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యురాలు మొలుగూరి సరోజన, నాయకులు వడ్లూరి విజ య్‌కుమార్, చొల్లేటి కిషన్‌రెడ్డి, కంకణాల విజయారెడ్డి, భగవాన్‌రెడ్డి, కొత్త అశోక్‌రెడ్డి, కంకణాల రమేష్‌రెడ్డి, అపరాజ ముత్యంరాజు, పోతుల సంజీవ్, మూగల సంజీవరెడ్డి, మూగల లక్ష్మారెడ్డి, పాకాల లక్ష్మారెడ్డి, చిలుముల సత్త య్య, సంగెం అయిలయ్య, జక్కుల ఓదేలు, ఓనగాని శ్రీనివాస్‌గౌడ్, పూసాల తిరుపతి, కొంర మ్మ, గాజె తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement