‘అహంకారం, అహంభావంతో టీఆర్ఎస్ పాలన’ | Trs government failed to fulfill election promises | Sakshi
Sakshi News home page

‘అహంకారం, అహంభావంతో టీఆర్ఎస్ పాలన’

Aug 5 2017 4:30 PM | Updated on Sep 17 2017 5:12 PM

‘అహంకారం, అహంభావంతో టీఆర్ఎస్ పాలన’

‘అహంకారం, అహంభావంతో టీఆర్ఎస్ పాలన’

రాజకీయ బిక్ష పెట్టిన కరీంనగర్ను కాదని సిద్ధిపేటకు సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీ ఇవ్వడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేతలు మండిపడుతున్నారు.

కరీంనగర్: రాజకీయ బిక్ష పెట్టిన కరీంనగర్ను కాదని సిద్ధిపేటకు సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీ ఇవ్వడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. జిల్లా కేంద్రంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పొన్నం ఆమరణ దీక్షకు కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి సంఘీభావం తెలిపారు. టీఆర్ఎస్ అహంకారం, అహంభావంతో వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. మూడేళ్లు గడిచినా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందన్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా ఆమరణ దీక్ష కాకుండా.. గ్రామ స్థాయిలో నిరవధిక దీక్ష చేపట్టాలని జానారెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఇవ్వకుంటే తాము అధికారంలోకి వచ్చాక కరీంనగర్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పొన్నం ప్రభాకర్‌తో పాటు దీక్షలో డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం చేపట్టిన ఈ దీక్షకు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement