టీఆర్‌ఎస్ ప్రచార వాహనం సీజ్ | TRS Canvassing vehicle seized at Marredpally | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ ప్రచార వాహనం సీజ్

Jan 28 2016 6:22 PM | Updated on Sep 3 2017 4:29 PM

అనుమతులు లేకుండా డీజే సౌండ్స్‌తో టీఆర్‌ఎస్ పార్టీకి ప్రచారం నిర్వహిస్తున్న ఓ ట్రాలీని మారేడుపల్లి పోలీసులు గురువారం సీజ్ చేశారు.

మారేడుపల్లి (హైదరాబాద్) : అనుమతులు లేకుండా డీజే సౌండ్స్‌తో టీఆర్‌ఎస్ పార్టీకి ప్రచారం నిర్వహిస్తున్న ఓ ట్రాలీని మారేడుపల్లి పోలీసులు గురువారం సీజ్ చేశారు. మోండా డివిజన్ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఆకుల రూప హరికృష్ణకు ప్రచారం నిర్వహిస్తున్న ఆటో ట్రాలీ ( ఏపీ 10 వీ 9834) వాహనానికి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అనుమతులు లేవన్న సమాచారంతో పోలీసులు ట్రాలీ డ్రైవర్ కరుణాకర్, సౌండ్‌బాక్స్‌ల నిర్వాహకుడు నీలంకర్‌ను మారేడుపల్లి కస్తూర్బా కళాశాల వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు తేలడంతో నిందితులపై కేసు నమోదు చేసి ఆటో ట్రాలీ, సౌండ్ బాక్స్‌లను సీజ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement