మహానగరంలో ఏ వ్యాపారం చేయాలన్నా తప్పకుండా లెసైన్స్ ఉండాల్సిందే. వ్యాపార అనుమతి పత్రాన్ని (ట్రేడ్ లెసైన్స్) గతంలో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి నిబంధనలకు అనుగుణంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్యాలయం జారీ చేసేది. అయితే, లెసైన్స్ జారీలో పారదర్శకత, త్వరితంగా ధృవీకరణ పత్రాలు మంజూరు, వ్యాపారులకు సౌకర్యంగా ఉండేందుకు ‘ఆన్‌లైన్’లో దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు.
దరఖాస్తు చేసుకున్న వెంటనే ప్రొవిజనల్ లెసైన్స్ పొందే వీలుండడం ఈ విధానం ప్రత్యేకత. ట్రేడ్ లెసైన్స్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి? ఏయే పత్రాలు జతచేయాలి? తదితర విషయాలు మీ కోసం..
రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోవాలి..
⇒ గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కొన్ని సేవలను ఈ- రిజిస్ట్రేషన్ విధానంతో అందిస్తున్నారు.
⇒ ఈ సేవలను పొందాలంటే ముందుగా మనం సంబంధిత సైట్‌లో రిజిస్టర్ అవ్వాలి.
⇒ ఇందుకు http://eghmc.ghmc.gov.in/ సైట్‌లో సిటిజన్ లాగిన్ కాలమ్‌లో ‘రిజిస్టర్ యువర్ సెల్ఫ్’ను క్లిక్ చేయాలి.
ఇక్కడ కనిపిస్తున్న రిజిస్ట్రేషన్ ఫామ్‌లో మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబరు, చిరునామా, పిన్‌కోడ్, ఈ- మెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది.
⇒ తరువాత ‘సబ్‌మిట్’ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే మీ ఈ- మెయిల్‌కు, ఫోన్‌కు పాస్‌వర్డ్ వస్తుంది.
⇒ మీ మొబైల్ ఫోన్ నంబరు మీకు యూజర్ నేమ్‌గా ఉంటుంది.
స్కాన్ చేసి ఉంచుకోవాల్సిన పత్రాలు..
⇒ రెంటల్ డీడ్, ప్రాపర్టీ టాక్స్ రసీదు, బిల్డింగ్ ప్లాన్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు పీడీఎఫ్ ఫార్మట్‌లో ఉంచుకోవాలి.
⇒ పైన పేర్కొన్న పత్రాల పరిమాణం ‘1 ఎంబీ’కి మించకూడదు.
దరఖాస్తు విధానం ఇలా...
⇒ మీకు యూజర్ నేమ్, పాస్‌వర్డ్ వచ్చిన తరువాత లాగిన్ అవ్వండి.
⇒ ఇక్కడి విండోలో ‘ట్రేడ్ లెసైన్స్’ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
⇒ స్క్రీన్‌పై కనిపిస్తున్న ‘ట్రాన్సాక్షన్’ ఆప్షన్‌లో సబ్ ఆప్షన్‌గా ఉన్న ‘అప్లై ఫర్ న్యూ ట్రేడ్ లెసైన్స్’ను ఎంచుకోవాలి. ఇప్పుడు మీకు దరఖాస్తు ఫామ్ వస్తుంది.
⇒ ఈ దరఖాస్తును నింపిన తర్వాత ‘సబ్‌మిట్’ చేస్తే మీకు దరఖాస్తు నంబరుతో ‘ఎకనాలెడ్జ్‌మెంట్- ప్రొవిజినల్ డిమాండ్ నోటీస్’ వస్తుంది.
⇒ ఇందులో మీరు చెల్లించాల్సిన రుసుం ఎంతో తెలియపరుస్తారు.
⇒ ఈ రుసుంను ‘మీ-సేవ’లో గానీ, ఇదే సైట్‌లో ‘ఆన్‌లైన్ పేమెంట్’ గాని చేయవచ్చు.
⇒ తరువాత మీకు రుసుం రసీదు, ప్రొవిజనల్ లెసైన్స్ జారీ చేస్తారు.
⇒ దరఖాస్తు అనంతరం ఎకనాలెడ్జ్‌మెంట్ పత్రాలు మీ ఈ-మెయిల్‌కు వచ్చేస్తాయి.
⇒ సంబంధిత అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనలో దరఖాస్తులో మీరు పేర్కొన్న అంశాలు సరైనవి అని తేలిన అనంతరం మీకు ‘ట్రేడ్ లెసైన్స్’ మంజూరు చేస్తారు.
దరఖాస్తు పరిశీలన గురించి..
⇒ ఇదే సైట్‌లో ‘రిపోర్ట్స్’ ఆప్షన్‌లో ‘అప్లికేషన్ స్టేటస్’ను క్లిక్ చేయాలి.
⇒ ఇక్కడ బై డిఫాల్ట్‌గా మీ దరఖాస్తు నంబర్ కనిపిస్తుంది.
⇒ దాని స్టేటస్ కూడా కాలమ్‌లో చివర కనిపిస్తుంది.
⇒ మీకు మరిన్ని వివరాలు కావాలంటే సంబంధిత దరఖాస్తును క్లిక్ చేసి ‘వ్యూ డీటేల్స్’ను క్లిక్ చేస్తే దరఖాస్తు వివరాలు ప్రత్యక్షమవుతాయి.
నోట్ : దరఖాస్తులో ‘*’ గుర్తున్న వాటిని కచ్చితంగా పూరించాలి. ఫోన్ నంబరు, ఈ-మెయిల్, చిరునామా కరెక్ట్‌గా ఇవ్వాలి. భవిష్యత్తులో సమాచారం పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్లింత్ ఏరియాను కరెక్ట్‌గా నమోదు చేయాలి.
ఈ- రిజిస్ట్రేషన్‌లో ‘ట్రేడ్ లెసైన్స్’ పొందండిలా..
Published Mon, Feb 9 2015 11:53 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement