విప్ ధిక్కరించిన వారిపై వేటేయండి | TPCC to complaint Election commission against rebels | Sakshi
Sakshi News home page

విప్ ధిక్కరించిన వారిపై వేటేయండి

Jul 6 2014 2:27 AM | Updated on Aug 14 2018 4:34 PM

మున్సిపల్, మండల, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల్లో విప్ ధిక్కరించిన ‘స్థానిక’ ప్రజాప్రతినిధులపై వేటు వేయించేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేస్తోం ది.

 ఈసీకి ఫిర్యాదు చేసేందుకు టీపీసీసీ సిద్ధం

 సాక్షి, హైదరాబాద్: మున్సిపల్, మండల, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల్లో విప్ ధిక్కరించిన ‘స్థానిక’ ప్రజాప్రతినిధులపై వేటు వేయించేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేస్తోం ది. టీఆర్‌ఎస్ ప్రలోభాలకు లొంగినవారిపై పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని పిటిషన్‌ను సిద్ధం చేస్తోంది. శనివారం వరకు అందిన సమాచారం మేరకు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్, కార్పొరేషన్ వార్డు సభ్యులు వెరసి ఐదొందల మందికిపైగా స్థానిక ప్రతినిధులు కాంగ్రెస్ విప్‌ను ధిక్కరించినట్లు టీపీసీసీకి సమాచారం అందింది. పూర్తి వివరాలతో టీపీసీసీ నేతల బృందం సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పి.రమాకాంత్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement