విషపు నీరు తాగి 12 గొర్రెలు మృతి | Toxic water kills 12 sheep | Sakshi
Sakshi News home page

విషపు నీరు తాగి 12 గొర్రెలు మృతి

Feb 5 2016 5:29 PM | Updated on Sep 3 2017 5:01 PM

పొలంలో విష గుళికలు కలిసిన నీరు తాగి 12 గొర్రెలు మృత్యువాతపడగా మరో 70 జీవాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి.

మిర్యాలగూడ రూరల్ (నల్లగొండ) : పొలంలో విష గుళికలు కలిసిన నీరు తాగి 12 గొర్రెలు మృత్యువాతపడగా మరో 70 జీవాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం నందిపాడు శివారు నందిగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన గంగుల రామలింగయ్య తన జీవాలను తోలుకుని శుక్రవారం పొలాల వైపు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో సమీపంలోని వరి పొలంలో నీరు తాగిన గొర్రెల్లో 12 కొద్దిసేపట్లోనే చనిపోయాయి. మరో 70 వరకు తీవ్ర అస్వస్థతకు గురి కావటంతో పశువైద్యులను పిలిపించి, వైద్యం చేయిస్తున్నారు. చనిపోయిన జీవాల విలువ రూ.లక్ష ఉంటుందని బాధితుడు తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement