బతుకమ్మపై ఫొటోగ్రఫీ పోటీలు | tourism department conducting photography compitition | Sakshi
Sakshi News home page

బతుకమ్మపై ఫొటోగ్రఫీ పోటీలు

Oct 17 2015 3:03 AM | Updated on Sep 3 2019 8:43 PM

రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో లైట్ క్రాఫ్ట్ ఫౌండేషన్ సహకారంతో జాతీయ బతుకమ్మ ఫొటోగ్రఫీ పోటీలు జరగనున్నాయి.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో లైట్ క్రాఫ్ట్ ఫౌండేషన్ సహకారంతో జాతీయ బతుకమ్మ ఫొటోగ్రఫీ పోటీలు జరగనున్నాయి. ‘మహిళలు-పూలు’ అనే ఇతివృత్తంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 16 నుంచి 31 వరకు ఈ పోటీలుంటాయని తెలిపింది. ఫొటోగ్రాఫర్లు వారి ఫొటోలను www.bathukamma photo.com, bathukammaphoto@gmail.com కు పంపించాలని పేర్కొంది.

ఈ నెల 31లోగా ఎంట్రీ చేసుకోవాలని సూచించింది. వివరాలకు 99633 71314 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొంది. మొదటి బహుమతి కింద రూ.1.5 లక్షలు, రెండో బహుమతిగా రూ.75 వేలు, మూడో బహుమతిగా రూ.50 వేలు, కన్సోలేషన్ బహుమతిగా రూ.25 వేలు అందజేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement