మా ప్రయోజనాలకు అడ్డుపడితే చంద్రబాబునైనా సహించం: జానా

Tomorrow Will Announce Candidates Names Says Jana Reddy - Sakshi

రేపు సాయంత్రం అభ్యర్థుల ప్రకటన

పొన్నాల పోటీకి లైన్‌క్లియర్‌ చేశాం  : జానారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో సీట్ల పంపకం తుది దశకు చేరుకుందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌నేత  కే. జానారెడ్డి తెలిపారు. ఎంతో ఉత్కంఠ రేపుతున్న అభ్యర్థుల ఎంపిక పూరైందని.. రేపు సాయంత్రానికి అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉందని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్‌ చర్చించిన తుది జాబితాలో పేరు లేని ఆపార్టీ సీనియర్‌ నేత పొన్నాల లక్ష్యయ్య టిక్కెట్‌కు లైన్‌ క్లియర్‌ చేశామని తెలిపారు. 

శుక్రవారం ఆయన మీడియతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు గతంలో ఇచ్చినట్లు ఈసారి కూడా సీట్లు ఇస్తామని పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పార్టీ ఇన్‌ఛార్జ్‌ కుంతియాలు దుబాయ్‌ పర్యటనలో ఉన్నారని వారు రాగానే భాగస్వామ్య పక్షాలతో కలిసి అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు అడ్డుపడితే చంద‍్రబాబు నాయుడిని సైతం సహించబోమన‍్నారు.

కేసీఆర్‌ను ఓడించి ప్రజలే  రికార్డు బ్రేక్‌ చేస్తారు..

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఓడించి ప్రజలే రికార్డు బ్రేక్‌ చేస్తారని జానారెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ కంటే కేసీఆర్‌ గొప్పవాడేం కాదన్న జానా.. అప్పులు చేసిన కేసీఆర్‌ అభివృద్ధి అంటూ గొప్పులు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నిర్ణయాలు ఆలస్యమైనప్పటికీ గెలుపు తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గెలిచేవారే మిర్యాలగూడ అభ్యర్థిగా ఉండాలనేది తన అభిప్రాయమన్నారు. ‘ కార్యకర్తలు నన్ను కానీ, నా కొడుకును కానీ పోటీ చేయాలంటున్నారు. హైకమాండ్‌  ఒకే అంటే నా కొడుకు పోటీ చేస్తాడు. సీఎం ఎవరు అవుతారన్నది చర్చకాదు.. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం. 2014లో కేసీఆర్‌ మాటలతో గెలిచాడు.. ఇప్పుడు మూటలతో గెలవాలని చూస్తున్నాడు. ఆశావాహుల్లో అసంతృప్తి అనేది సహజంజ తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీస్తే ఎవరినైనా సహించం. తెలంగాణ ప్రయోజనాలకు అడ్డుపడితే చంద్రబాబునైనా సహించం. కేసీఆర్‌ ఆత్మగౌరవం దెబ్బతీస్తే  ఆయన్న కూడా సహించటం లేదు. ఇక బయటవారిని సహిస్తామా? పొత్తు కోసం మేము వెళ్లలేదు.. చంద్రబాబే మా వద్దకు వచ్చారు’ అని జానారెడ్డి తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top