రేపు ఆర్మూర్‌లో సీఎం కేసీఆర్‌ సభ | Tomorrow CM KCR Sabha In Armoor | Sakshi
Sakshi News home page

రేపు ఆర్మూర్‌లో సీఎం కేసీఆర్‌ సభ

Nov 21 2018 1:10 PM | Updated on Nov 21 2018 1:11 PM

 Tomorrow CM KCR Sabha In Armoor - Sakshi

ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎంపీ కవిత, జీవన్‌ రెడ్డి

 సాక్షి, ఆర్మూర్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు (గురువారం) ఆర్మూర్‌కు రానున్నారు. పట్టణంలోని మినీ స్టేడియంలో గురువారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభ నిర్వహించునున్నట్లు ఎంపీ కవిత తెలిపారు. సభ ఏర్పాటు పనులను, హెలీప్యాడ్‌ను ఎంపీ కవిత, టీఆర్‌ఎస్‌ ఆర్మూర్‌ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు.

భద్రతా పరంగా ఎలాంటి లోటు పాట్లు ఉండకుండా చూసుకోవాలని ఆర్మూర్‌ సీఐ రాఘవేందర్‌కు సూచించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. అధిక సంఖ్యలో మహిళలు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.

ఎన్నికల తర్వాత కూటమి మాయం 

   సాక్షి, బాన్సువాడ: మహాకూటమి అధికార దాహంతో అడ్డదారులు తొక్కుతున్నది. ఈ కూటమికి దశాదిశా లేదు. కూటమికి మేనిఫెస్టో కూడా లేదు. దాన్ని అమలు చేసే వారు దిక్కు లేరు.. ఎన్నికల తర్వాత ఈ కూటమి మాయమై పోతది.. ఆ కూటమితో జనాలకు ఒరిగిందేమీ లేదు... నాలుగేళ్లలో మేం ఎన్నో అద్భుతాలు చేసి చూపించినం. వచ్చే ఐదేళ్లలో ఇంకా చాలా అద్భుతాలు చేయాల్సి ఉంది. చివరకు మా లక్ష్యం బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనే...

కోటగిరి మండలంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా పోచారం వ్యాఖ్యలు

Advertisement
 
Advertisement
Advertisement