మురికి కాలువలో పసికందు | toddler found in drinage in mahaboobnagar | Sakshi
Sakshi News home page

మురికి కాలువలో పసికందు

Aug 3 2015 11:52 AM | Updated on Sep 3 2017 6:43 AM

గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును మురికికాలువలో వదిలివెళ్లారు.

మహబూబ్‌నగర్: గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును సోమవారం మురికికాలువలో వదిలివెళ్లారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో గాంధీనగర్ కాలనీ సిల్వర్ జూబ్లీ క్లబ్ సమీపంలోని వీరేష్ ఇంటిముందు చోటుచేసుకుంది. పాప ఏడుపు గుర్తించిన వీరేష్ భార్య పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం అందించింది.

దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు 108 సాయంతో చిన్నారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. పాప పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement