నేడు జిల్లాకు ఎంపీ కవిత రాక | Today the district The arrival of MP Kavitha | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాకు ఎంపీ కవిత రాక

Feb 19 2015 4:42 AM | Updated on Sep 2 2017 9:32 PM

నేడు జిల్లాకు ఎంపీ కవిత రాక

నేడు జిల్లాకు ఎంపీ కవిత రాక

నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత గురువారం జిల్లా పర్యటనకు రానున్నారు.

నిజామాబాద్‌కల్చరల్ : నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత గురువారం జిల్లా పర్యటనకు రానున్నారు. ఆమె ఉదయం 10 గంటలకు ఆర్మూర్ మున్సిపాలిటీలో నిర్వహించే సమీక్ష సమావేశంలో పాల్గొంటారని టీఆర్‌ఎస్ నాయకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు మానిక్‌భండార్ గ్రామాన్ని సందర్శిస్తారని, 2 గంటలకు ఖలీల్‌వాడిలో ఓ ఆస్పత్రిని ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

అనంతరం ప్రగతనగర్ వెళ్లి ఇటీవల మరణించిన ప్రముఖ నవలా రచయత డాక్టర్ కేశవరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారని, జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు చేస్తున్న దీక్షలకు సంఘీభావం ప్రకటిస్తారని, సాయంత్రం 5 గంటలకు బీసీ ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరిస్తారని, 5.15 గంటలకు రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జరిగే హరిదా రచయితల సంఘం ద్వితీయ మహాసభలో పాల్గొంటారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement