పోలింగ్ నేడే | today polling | Sakshi
Sakshi News home page

పోలింగ్ నేడే

Mar 30 2014 2:46 AM | Updated on Sep 17 2018 6:08 PM

మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని వికారాబాద్, తాండూ రు, ఇబ్రహీంపట్నం, పెద్దంఅంబర్‌పేట, బడంగ్‌పేట మున్సిపాలిటీలు/నగర పంచాయతీల పరిధిలో ఆదివారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా : మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని వికారాబాద్, తాండూ రు, ఇబ్రహీంపట్నం, పెద్దంఅంబర్‌పేట, బడంగ్‌పేట మున్సిపాలిటీలు/నగర పంచాయతీల పరిధిలో ఆదివారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇందుకు సంబంధించి జిల్లా యం త్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
 
ఈ మున్సిపాలిటీల పరిధిలో 119 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం 193 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ఈవీఎం చొప్పున 193 ఈవీఎంలను కేంద్రాలకు చేర వేశారు. అయితే సాంకేతిక సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా 20శాతం అంటే 37 ఈవీఎంలు అద నంగా అందుబాటు లో ఉంచారు. పోలిం గ్ ప్రక్రియ కోసం 1,004 మంది సిబ్బం దిని నియమించగా.. వారు శనివారం సా యంత్రానికి ఆయా కేంద్రాలకు చేరుకున్నారు.
 
బరిలో 663 మంది..
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 663 మంది బరిలో నిలిచారు. ఇందులో వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 121 మంది, తాండూ రు మున్సిపాలిటీలో 177, ఇబ్రహీంపట్నంలో 125, పెద్ద అంబర్‌పేటలో 89, బడంగ్‌పేట్‌లో 151 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఐదు మున్సిపాలిటీల పరిధిలో 1,98,895 మంది ఓటు హక్కును వినియోగించుకుని 119 మంది కౌన్సిలర్లను ఎన్నుకోనున్నారు.
 
కొనసాగుతున్న ప్రలోభాలపర్వం..
ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ.. అంతర్గతంగా అభ్యర్థులు ప్రచారపర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఓటర్లను బుట్టలో వేసుకోవడానికి ప్రలోభాలను ఎరవేస్తున్నారు. అభ్యర్థులను ఫోన్లలో సంప్రదిస్తూ.. ఇంటికి వెళ్లి మరీ ఓటు వేయాలంటూ ప్రాధేయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement