
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
కాళోజీసెంటర్/విద్యారణ్యపురి: అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులతో శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖాముఖి కార్యక్రమం జరగనుంది. ఉదయం 10.45గంటల నుంచి 11.45గంటల వరకు మాట్లాడనున్నారు. ఈమేరకు అవసరమైన ఎల్‌ఈడీ టీవీ, ప్రొజెక్టర్లును విద్యాశాఖ ఏర్పాటు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ తరహాలో ప్రధాని విద్యార్థులతో మాట్లాడి చదువుపై విద్యార్థుల శ్రద్ధ, పాఠశాలల్లో సమస్యలు, విద్యాబోధన తదితర అంశాలను తెలుసుకోనున్నారు. ప్రధానోపాధ్యాయులతోనూ మాట్లాడుతారని వరంగల్ రూరల్ డీఈఓ కంకటి నారాయణరెడ్డి తెలిపారు. తొలిసారిగా ప్రధాని విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడనున్నందున వారిలో ఆనందం వెల్లివిరుస్తోంది.
నేటి టెన్త్ ప్రీఫైనల్ పరీక్ష మధ్యాహ్నం
విద్యారణ్యపురి: అన్ని ఉన్నత పాఠశాలల్లో గురువారం పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు మధ్యాహ్నం 2గంటల నుంచి 4.45 గంటల వరకు నిర్వహించాలని వరంగల్ అర్బన్ డీఈఓ కె.నారాయణరెడ్డి ఓ ప్రకటనలో హెచ్‌ఎంలను ఆదేశించారు. ఉదయం 11.45 గంటలకు ప్రధాని మోదీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.