గోదావరిలో ముగ్గురు యువకుల గల్లంతు | Three young people missing in Godavari River | Sakshi
Sakshi News home page

గోదావరిలో ముగ్గురు యువకుల గల్లంతు

Feb 3 2019 1:39 AM | Updated on Feb 3 2019 1:39 AM

Three young people missing in Godavari River - Sakshi

శ్రీనివాసరెడ్డి (ఫైల్‌), శేషు (ఫైల్‌), శివారెడ్డి (ఫైల్‌)

బూర్గంపాడు: భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన కుందూరు శ్రీనివాసరెడ్డి(21), కారంపూడి శేషు(24), తిరుమలరెడ్డి శివారెడ్డి (23) మరో ముగ్గురు మిత్రులతో కలసి గోదావరి వద్దకు వెళ్లారు. మిత్రుడు గాదె విజయ్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా అక్కడ విందు ఏర్పాటు చేసుకున్నారు.

శ్రీనివాసరెడ్డి, శేషు, శివారెడ్డి స్నానం చేసేందుకు నదిలోకి కొంతదూరం వెళ్లాక ఒక్కసారిగా కేకలు వేస్తూ మునిగిపోయారు. మిగిలినవారు రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బూర్గంపాడు, కుక్కునూరు పోలీసులు గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement