తాండూరులో మూడేళ్ల బాలుడి హత్య | three years old boy murdered in ranga reddy district | Sakshi
Sakshi News home page

తాండూరులో మూడేళ్ల బాలుడి హత్య

Apr 10 2016 5:23 PM | Updated on Jul 12 2019 3:29 PM

రంగారెడ్డి జిల్లా తాండూరులో విషాదం చోటుచేసుకుంది. సిరిగిరిపేట గ్రామానికి చెందిన హన్మంతు,లక్ష్మి దంపతుల కుమారుడు రాఘవేందర్(3) దారుణ హత్యకు గురయ్యాడు.

తాండూరు: రంగారెడ్డి జిల్లా తాండూరులో విషాదం చోటుచేసుకుంది. సిరిగిరిపేట గ్రామానికి చెందిన హన్మంతు,లక్ష్మి దంపతుల కుమారుడు రాఘవేందర్(3) దారుణ హత్యకు గురయ్యాడు.

ఈ నెల ఐదవ తేదీ నుంచి కుమారుడు కనిపించకపోవడంతో... స్థానిక పోలీస్‌స్టేషన్లో చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అనూహ్యంగా ఆదివారం మధ్యాహ్నం గ్రామశివారులో బాలుడి మృతదేహం లభ్యమైంది. తమ కుమారుడిని సమీప బంధువులు బాలప్ప, చంద్రమ్మలే క్షుద్రపూజల కోసం హత్య చేశారని రాఘవేందర్ తల్లిదండ్రులు చెబుతున్నారు. బాలుడి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement