పోలీసుల వద్దకు చేరిన మూడేళ్ల చిన్నారి | three years girl with rajendra nagar police | Sakshi
Sakshi News home page

పోలీసుల వద్దకు చేరిన మూడేళ్ల చిన్నారి

Apr 5 2015 6:49 PM | Updated on Aug 28 2018 7:09 PM

పోలీసుల వద్దకు చేరిన మూడేళ్ల చిన్నారి - Sakshi

పోలీసుల వద్దకు చేరిన మూడేళ్ల చిన్నారి

గుర్తు తెలియని మూడేళ్ల చిన్నారి నగరంలోని రాజేంద్రనగర్ పోలీసుల వద్దకు చేరింది.

హైదరాబాద్: గుర్తు తెలియని మూడేళ్ల చిన్నారి నగరంలోని రాజేంద్రనగర్ పోలీసుల వద్దకు చేరింది. శివరాంపల్లి ప్రాంతంలో ఒంటరిగా ఉన్న ఆమెను స్థానికులు వివరాలు అడగ్గా ఏమీ చెప్పలేని స్థితిలో ఉండేసరికి పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో రాజేంద్రనగర్ పోలీసులు ఆమెను ఆదివారం సాయంత్రం స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా... తన పేరు జీనత్ అని తెలిపింది. కాగా, చిన్నారి సంబంధీకులు ఎవరైనా తమను సంప్రదించాలని పోలీసులు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement