ముగ్గురు వాహన దొంగలు అరెస్ట్ | Three Vehicle thieves arrested | Sakshi
Sakshi News home page

ముగ్గురు వాహన దొంగలు అరెస్ట్

Jul 9 2015 3:04 PM | Updated on Aug 20 2018 4:44 PM

ముగ్గురు వాహన దొంగలు అరెస్ట్ - Sakshi

ముగ్గురు వాహన దొంగలు అరెస్ట్

నగరంలో గత కొంతకాలంగా వాహనాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

సరూర్‌నగర్ (రంగారెడ్డి) : నగరంలో గత కొంతకాలంగా వాహనాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. సరూర్‌నగర్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుల నుంచి ఎనిమిది బైక్‌లు, ఒక మారుతి కారు, నాలుగు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మీర్‌పేటకు చెందిన శివ గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా హయత్‌నగర్‌కు చెందిన కావలి కృష్ణ, సరూర్‌నగర్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్‌లు శివతో జతకట్టారు. ఈ ముగ్గురు ముఠాగా ఏర్పడి నగరంలోని పలుచోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement