ట్రాక్టర్ బోల్తా: ముగ్గురు కూలీలు మృతి | Three killed in tractor overturned, nalgonda district | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా: ముగ్గురు కూలీలు మృతి

Mar 18 2015 8:39 AM | Updated on Aug 28 2018 7:14 PM

నల్గొండ జిల్లా మఠంపల్లి మండలం అవరేనికుంట తండ వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

నల్గొండ : నల్గొండ జిల్లా మఠంపల్లి మండలం అవరేనికుంట తండ వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు.

మృతదేహలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  మేళ్లచెరువు మండలంలో మిర్చి పంట కోసేందుకు వారంతా ట్రాక్టర్లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ట్రాకర్ట్ అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని కూలీలు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement