లారీ బోల్తా : ముగ్గురికి గాయాలు | Three Injured : lorry overturned in warangal highway | Sakshi
Sakshi News home page

లారీ బోల్తా : ముగ్గురికి గాయాలు

Jan 28 2016 9:35 AM | Updated on Sep 3 2017 4:29 PM

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం జాతీయరహదారిపై గురువారం పత్తి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది.

వరంగల్ : వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం జాతీయరహదారిపై గురువారం పత్తి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని...క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే లారీ బోల్తాతో రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. పోలీసులు రంగంలోని దిగి ట్రాఫిక్ను క్రమబద్దీకరిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement