రెండు కార్లు ఢీ | Three injured in Road accident | Sakshi
Sakshi News home page

రెండు కార్లు ఢీ

May 14 2015 3:50 PM | Updated on Aug 30 2018 3:58 PM

మెదక్ జిల్లా పుల్కల్ మండలం కార్‌దాన్‌పల్లి వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

పుల్కల్ (మెదక్) : మెదక్ జిల్లా పుల్కల్ మండలం కార్‌దాన్‌పల్లి వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.   కార్‌దాన్‌పల్లి గ్రామంలోని చౌరస్తా వద్ద ఇండికా కారు టైరు పేలి అదుపు తప్పి ఎదురుగా వస్తున్న స్విఫ్ట్ కారును ఢీకొంది. దీంతో ఇండికా కారులో ఉన్న ముగ్గురిలో రహీనాబేగం అనే మహిళ తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడి  వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌ ఉస్మానియాకు తరలించారు. క్షతగాత్రురాలు హైదరాబాద్‌లోని కిషన్ బాగ్కు చెందిన మహిళగా గుర్తించారు. అలాగే స్విఫ్ట్ కారులో ఉన్న ఐదుగురిలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement