జ్వరంతో ముగ్గురి మృతి | Three Die With Fever | Sakshi
Sakshi News home page

జ్వరంతో ముగ్గురి మృతి

Aug 20 2018 12:47 PM | Updated on Aug 20 2018 12:47 PM

Three Die With Fever - Sakshi

వెంకటేశ్వరరావు (ఫైల్‌) రాజు (ఫైల్‌)  ఆదర్శ్‌ (ఫైల్‌)

ముగ్గురిని జ్వరాలు బలిగొన్నాయి. దమ్మపేట మండలంలో ఒకరు, ఇల్లెందు మండలంలో ఇంకొకరు, మణుగూరులో మరొకరు మృతిచెందారు.దమ్మపేట: మండలలోని ముష్టిబండకు చెందిన రైతు పరిటాల వెంకటేశ్వరరావు(55), జ్వరంతో శనివారం మృతిచెందాడు. ప్లేట్‌లెట్స్‌ తగ్గడంతో కుటుంబీకులు సత్తుపల్లి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

మణుగూరులో బాలుడు... 

మణుగూరుటౌన్‌ : మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురంలో డెంగీ జ్వరంతో బాలుడు మృతిచెందాడు. స్థానిక ప్రయివేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కాకర్ల ఆదర్శ్‌(15), గత ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానిక ప్రయివేటు వైద్యశాలలో కుటుంబీకులు చేర్పించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఆదివారం మృతిచెందాడు.

ముకుందాపురంలో యువకుడు... 

ఇల్లెందు: మండలంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన కోయడ రాజు(35), కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. జ్వరం తీవ్రమవడంతో రెండు రోజులు క్రితం హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ వైద్యశాలలో కుటుంబీకులు చేర్పించారు. అతడు అక్కడే ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement