ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు    | Three children in single delivery | Sakshi
Sakshi News home page

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు   

May 16 2018 11:52 AM | Updated on Aug 17 2018 2:56 PM

Three children in single delivery - Sakshi

పిల్లలను రిమ్స్‌లో చిల్డ్రన్స్‌ వార్డులో ఉంచిన దశ్యం 

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మ నిచ్చింది. మహారాష్ట్రలోని కిన్వాట్‌ ఆసీఫ్‌ తన భార్య అంజూమ్‌ను పురిటినొప్పులు రావడం తో సోమవారం రిమ్స్‌కు తీసుకొచ్చాడు. అయి తే ఆమెకు ఇంకా 9 నెలలు కూడా నిండకపోవడంతో వైద్యులు రిమ్స్‌లో అడ్మిట్‌ చేసుకున్నారు. అయితే మంగళవారం తీవ్ర నొప్పులు రావడంతో ఆపరేషన్‌ చేసి కాన్పు చేశారు. దీం తో ఆమెకు ఇద్దరు పాపలు, ఒక బాబు పు ట్టారు. మొదటి కాన్పు, అదీ కూడా 8 నెలలకే ప్రసూతి అయినప్పటికీ పుట్టిన శిశువులు ఆరోగ్యంగానే ఉన్నారు. ఇందులో ఒకరు 1.5 కేజీ, మరొకరు 1.25 కేజీ, బాబు1.3 కేజీలు ఉన్న ట్లు చిల్డ్రన్స్‌ డాక్టర్‌ సూర్యకాంత్‌ తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం బాగానే ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement