బతికించాల్సిన వారే.. బయటికి గెంటేశారు | those help they sent out | Sakshi
Sakshi News home page

బతికించాల్సిన వారే.. బయటికి గెంటేశారు

Jun 14 2015 5:06 AM | Updated on Aug 30 2018 3:56 PM

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి 13 రోజుల క్రితం ఏరియా ఆస్పత్రికి రాగా వైద్యులు కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేయకుండా నిర్లక్ష్యం చేశారు...

- గాయపడిన వ్యక్తికి 13 రోజులుగా చికిత్స అందించని ప్రభుత్వ వైద్యులు
- కుళ్లిపోరున బాధితుడి కాలు
- దుర్వాసన వచ్చి పురుగులు పట్టినా పట్టించుకోని సిబ్బంది
- కాంగ్రెస్ నాయకుల ఆందోళనతో అందిన చికిత్స
- సూపరింటెండెంట్‌ను సస్పెండ్
- చేయూలని ఆస్పత్రి ఎదుట ధర్నా
మహబూబాబాద్ :
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి 13 రోజుల క్రితం ఏరియా ఆస్పత్రికి రాగా వైద్యులు కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేయకుండా నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా అతడి కాలికి సెఫ్టిక్ అరుు్య పురుగులు పడి కుళ్లిపోరుుంది. దుర్వాసన వస్తుండడంతో రోగులిచ్చిన సమాచారంతో కాంగ్రెస్ నాయకులు రాగా అసలు విషయం బయటపడింది. మానుకోట ఏరియూ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నారుు.

బాధితుడి కథనం ప్రకారం.. నర్సంపేట పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన భాస్కర్ల మోహన్ 13 రోజుల క్రితం పని మీద మానుకోటకు వచ్చాడు. పట్టణంలోని పాతబజారులోని రూరల్‌పోలీస్‌స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో అతడు గాయపడ్డాడు. స్థానికుల సహకారంతో ఏరియా ఆస్పత్రికి చేరుకున్న అతడికి వైద్యులు చికిత్స అందించలేదు. కనీసం అడ్మిట్ కూడా చేసుకోలేదు. సిబ్బంది కూడా పట్టించుకోకపోవడంతో చేసేదేమి లేక ఆస్పత్రి ఆవరణలోనే జీవచ్ఛవంగా ఉండిపోయాడు.  ఎడమ కాలి నుంచి రక్తం కారి చివరికి కుళ్లిపోరుు కాలి ఎముకలు కూడా బయటకెళ్లారు.

కుళ్లిపోరు పురుగులు వస్తున్నా, కంపు కొడుతున్నా అతడిని ఎవరూ పట్టించుకోలేదు. అటువైపు నుంచి వైద్యులు, రోగులు వెళ్తూ ఆ దుర్వాసన భరించలేక ముక్కు మూసుకున్నారే తప్పా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆస్పత్రికి వచ్చిన కొందరు రోగులు కాంగ్రెస్ నాయకులకు సమాచారమిచ్చారు. జెడ్పీ ఫ్లోర్‌లీడర్ మూలగుండ్ల వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షుడు ముల్లంగి ప్రతాప్‌రెడ్డి అక్కడికి చేరుకుని బాధితుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి.వెంకట్రాములు అక్కడికి చేరుకోగా.. విధుల్లో ఇంత నిర్లక్ష్యమా అని నాయకులు నిలదీశారు. ఆయన మాత్రం తనకు ఈ విషయం తెలియదని సమాధానమిచ్చారు. ఈ క్రమంలో వారికి  ఆయనతో తీవ్రవాగ్వాదం జరిగింది. దీంతో వారు డీఎంఅండ్‌హెచ్ డీసీహెచ్‌ఓతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయమై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో ఎట్టకేలకు స్పందించిన వైద్యులు మోహన్‌ను ఆస్పత్రిలోని వార్డుకు తీసుకె ళ్లి చికిత్స ప్రారంభించారు.
 
సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయూలి : కాంగ్రెస్ నాయకులు

విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏరియూ ఆస్పత్రి సూపరింటెండెంట్ టి.వెంకట్రాములును సస్పెండ్ చేయూలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఎదుట నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోహన్ కాలు కోల్పోవడానికి కారణం వైద్యులేనన్నారు. కార్యక్రమంలో నాయకులు పంజాల శ్రీను, బొల్లు రాజు, అప్పె వేణు, గుగులోత్ వెంకట్, సోమ శ్రీనివాస్, వెంకటాచారి, భాస్కర్, వీరభద్రం, మహమూద్, ప్రసాద్, రోగులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement