ఈ ఏడాది లక్ష ఉద్యోగాల భర్తీ: కడియం | This year replacement of one lakh jobs: Kadiyam | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది లక్ష ఉద్యోగాల భర్తీ: కడియం

Apr 16 2015 2:24 AM | Updated on Jul 11 2019 5:07 PM

ఈ ఏడాది లక్ష ఉద్యోగాల భర్తీ: కడియం - Sakshi

ఈ ఏడాది లక్ష ఉద్యోగాల భర్తీ: కడియం

ఈ ఏడాది లక్ష ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు.

గజ్వేల్: ఈ ఏడాది లక్ష ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. విద్యాశాఖతోపాటు ఇతర శాఖల్లో ఉన్న సుమారు లక్షకు పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గమైన మెదక్‌జిల్లా గజ్వేల్‌లో బుధవారం ఆయన పర్యటించారు. నగరపంచాయతీ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎడ్యుకేషన్ హబ్‌కు సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు.

అనంతరం కడియం విలేకరులతో మాట్లాడారు. విద్యారంగ అభివృద్ధిపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. బడ్జెట్‌లో ఇప్పటికే రూ.11 వేల కోట్లను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. గురుకుల విద్యా వ్యవస్థను కూడా పటిష్టం చేయనున్నట్టు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement