అయ్యో! దొంగ ఎంత పనిచేశాడు.. | Thief Sets Fire To House In Secundrabad | Sakshi
Sakshi News home page

అయ్యో! దొంగ ఎంత పనిచేశాడు..

Mar 21 2017 10:35 AM | Updated on Aug 30 2018 5:27 PM

అయ్యో!  దొంగ ఎంత పనిచేశాడు.. - Sakshi

అయ్యో! దొంగ ఎంత పనిచేశాడు..

ఓ ఇంటికి దొంగతనానికి వచ్చిన వ్యక్తి అక్కడ ఏమి దొరకకపోవడంతో..

సికింద్రాబాద్‌: నగరంలోని మారేడ్‌పల్లిలో మంగళవారం తెల్లవారుజామున దారుణం వెలుగుచూసింది. ఓ ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగ అక్కడ ఏమి దొరకకపోవడంతో.. ఆగ్రహానికి గురై ఆ ఇంటికే నిప్పు పెట్టాడు. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement