రంగారెడ్డి జిల్లాలో ఓ ఘరానా దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హయత్‌నగర్: రంగారెడ్డి జిల్లాలో ఓ ఘరానా దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి బంగారు ఆభరణాలతో పాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువులు, నగదును స్వాధీనం చేసుకున్నారు.
హయత్‌నగర్ మండలంలోని కందుకూరు గ్రామం వద్ద అనుమానస్పదంగా తిరుగుతున్న మహేష్ అనే దొంగను పోలీసులు అదుపులోకి విచారించారు. ఇళ్లు, మొబైల్, వైన్ షాపుల్లో దొంగతనాలకు పాల్పడిన పాత నేరస్థుడిగా పోలీసులు గుర్తించారు. అతడి నుంచి పది తులాల బంగారు ఆభరణాలు, మూడు ఎల్‌ఈడీ టీవీలు, ఆరు సెల్‌ఫోన్లు, రూ.6వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.