థియేటర్లన్నీ ఆ నలుగురి చేతుల్లోనే.. | Sakshi
Sakshi News home page

థియేటర్లన్నీ ఆ నలుగురి చేతుల్లోనే..

Published Mon, Jun 25 2018 1:22 PM

Theatres In Four Producers Hand : Ramakrishna Goud - Sakshi

యాదగిరిగుట్ట (ఆలేరు) : తెలుగు సినీ ఇండస్ట్రీలో థియేటర్లు అన్నీ సురేష్‌బాబు, అల్లు అరవింద్, దిల్‌రాజ్, సునీల్‌ చేతిల్లోనే ఉన్నాయని తెలంగాణ ఫిలిమ్‌ చాంబర్‌ చైర్మన్‌ ప్రతాని రామకృష్ణగౌడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ నలుగురు రెండు రాష్ట్రాల్లోని థియేటర్లను తమచేతుల్లో పెట్టుకుని చిన్న సినిమాలు విడుదల కాకుండా చేస్తున్నారని అన్నారు. ఆ నలుగురికి దీటుగా చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు త్వరలోనే డిజిటల్‌ చానల్‌ ప్రారంభిస్తున్నామని.. దీనికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఉందని తెలిపారు.

ప్రభుత్వానికి 20శాతం పన్ను కడుతూ.. చిన్న, పెద్ద సినిమాలను రిలీజ్‌ చేసేం దుకు ముందుకు వెళ్తుమన్నారు. థియేటర్లు అవస రం లేకుండానే మా డిజిటల్‌ ద్వారానే అన్ని టీవీ ల్లో సినిమాలను విడుదల చేస్తామని అన్నారు. ఇం డియాలో ఎక్కడ లేని విధంగా ‘మా’ డిజిటల్‌ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ‘మా’ డిజిటల్‌ ద్వారా సుమారు 1000 చిన్న సినిమాలను రిలీజ్‌ చేస్తామన్నారు. ఇది విజయవంతం కావాలని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని వేడుకున్నట్లు చెప్పారు. సమావేశంలో సోగ్గాడే శోభన్‌ కృష్ణ సినిమా హీరో రాయగిరి ఉమాపతిగౌడ్, డైరెక్టర్‌ జింక హరీష్‌బాబు, సినిమా ఆర్టిస్టు సత్యనారాయణ ఉన్నారు. 

Advertisement
Advertisement