వాటర్ గ్రిడ్‌ను కోరుతూ.. ఎమ్మెల్యే ఇంటి ముట్టడి | The protest for water grid.. at MLA's house | Sakshi
Sakshi News home page

వాటర్ గ్రిడ్‌ను కోరుతూ.. ఎమ్మెల్యే ఇంటి ముట్టడి

Nov 8 2015 4:36 PM | Updated on Sep 3 2017 12:14 PM

వాటర్ గ్రిడ్ ను తమ ఊరిలో ఏర్పాటు చేయాలంటూ ఇబ్రహీంపట్నం మండలం ప్రజలు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు.

వాటర్ గ్రిడ్‌ను తమ ఊరిలో ఏర్పాటు చేయాలంటూ ఇబ్రహీంపట్నం మండల ప్రజలు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ నివాసాన్ని ముట్టడించారు. అంతకు ముందు మెట్‌పల్లిలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటి ముందు ఆందోళనకు దిగడంతో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement