ఎంపీ మదిలో ఏ ఊళ్ల్లున్నాయో...? | The preferred option of the tribal villages | Sakshi
Sakshi News home page

ఎంపీ మదిలో ఏ ఊళ్ల్లున్నాయో...?

Oct 25 2014 4:12 AM | Updated on Jul 26 2019 5:58 PM

ఎంపీ మదిలో ఏ ఊళ్ల్లున్నాయో...? - Sakshi

ఎంపీ మదిలో ఏ ఊళ్ల్లున్నాయో...?

గ్రామీణ భారతాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రతి ఎంపీ మూడు గ్రామాలను దత్తత తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వడంతో...

* ఎస్‌ఏజీవై కింద ఎంపికయ్యే పల్లెలపై ఆసక్తి
* గిరిజన గ్రామాల ఎంపికకే ప్రాధాన్యం

మోర్తాడ్ :గ్రామీణ భారతాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రతి ఎంపీ మూడు గ్రామాలను దత్తత తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వడంతో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఏ గ్రామాలను దత్తత తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. పల్లెలను అభివృద్ధి పథంలో నడపాలం టే ఎంపీలు తలా మూడు గ్రామాల చొప్పున దత్తత తీసుకుని 2019 నాటికి ఆయా గ్రామాల రూపు రేఖ లు మార్చాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సాంసద్ ఆదర్శ్ గ్రామ యోజన(ఎస్‌ఏజీవై)ను ప్రధాని ప్రారంభించారు. ఈపథకం అమలులో భాగంగా ఎంపీ కవిత ఏ గ్రామాలను దత్తత తీసుకుంటారోనని ప్రజలు ఆసక్తితో చర్చించుకుం టున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధి లో బోధన్, నిజామాబాద్ అర్బన్, రూరల్, బా ల్కొం డ, ఆర్మూర్ నియోజకవర్గాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని కొరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలు ఉన్నాయి. పల్లెలను మాత్రమే దత్తత తీసుకోవాలని ప్రధాని పిలుపునివ్వడంతో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి ఎస్‌ఏజీవై నుంచి మినహా యింపు ఉంటుంది.

బోధన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కొరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లోని గ్రామాల్లో మూడింటిని ఎంపీ ఎంపిక చేయాల్సి ఉంది. మౌలిక సదుపాయాలు లేని గ్రా మాలను ఎంపీలు ఎంపిక చేయాల్సి ఉంది. కాగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అలాంటి గ్రామాలను ఎంపీ ప్రత్యేకంగా పరిశీలించాల్సి ఉంది. అభివృద్ధికి దూరంగా ఉన్న పల్లెలు అంటే ఎక్కువగా గిరిజన గ్రామాల్లోనే అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంపీ మొదట ఒక గ్రామాన్ని ఎం పిక చేసి నమూనా గ్రామంగా గుర్తించి నిధులను కేటాయించాల్సి ఉంది. కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించి ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కలిగాయా లేదానని పర్యవేక్షించాలి.

ఒక గ్రామాన్ని తొలిఏడాదిలో అభివృద్ధి చేసిన తరువాత మరో రెండు గ్రామాలను ఎంపిక చేసి 2019 వరకు అభివృద్ధి చేయాలి. ఎంపీ ఎంపిక చేసే గ్రా మాల్లో సొంత గ్రామం కానీ, అత్తామామల గ్రామం కానీ ఉండరాదు. ఎంపీ మూడు గ్రామాలను ఎంపిక చేసి ఆ గ్రామాల వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంది. అయితే నిజామాబాద్ జిల్లాలో రెండు, కరీంనగర్ జిల్లాలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసే అవకాశం ఉందని ఎంపీ సన్నిహితులు తెలి పారు. ఇప్పటికే మారుమూల గ్రామాల వివరాలు, అక్కడి స్థితిగతుల గురించిన సమాచారాన్ని ఎంపీ సేకరించారని తెలిసింది. నమూనా గ్రామాలను ఎంపిక చేసిన తరువాత ఎలాంటి వివాదం లేకుండా ఉండటానికి ఎంపీ జాగ్రత్తలు తీసుకుంటున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. నమూనా గ్రామాలు ఏమిటనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement