దమ్మున్న పార్టీ టీఆర్‌ఎస్: కవిత | The guts of the TRS party says Kavitha | Sakshi
Sakshi News home page

దమ్మున్న పార్టీ టీఆర్‌ఎస్: కవిత

Mar 6 2015 3:02 AM | Updated on Aug 9 2018 4:51 PM

దమ్మున్న పార్టీ టీఆర్‌ఎస్: కవిత - Sakshi

దమ్మున్న పార్టీ టీఆర్‌ఎస్: కవిత

దమ్మున్న పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమేననీ.. దమ్మున్న లీడర్ కేసీఆర్ ఒక్కరేనని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు.

నిజామాబాద్: దమ్మున్న పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమేననీ.. దమ్మున్న లీడర్ కేసీఆర్ ఒక్కరేనని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. గురువారం నిజామాబాద్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ 101 హామీలపై ఓ పార్టీ నాయకుడు పోస్టర్ వేసి ప్రచారం చేసుకోవటం దౌర్భాగ్యమని షబ్బీర్‌అలీపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన ఆమె, ఎన్నికల్లో హామీఇవ్వని వెయ్యినొక్క పనులు కేసీఆర్ చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజల బతుకులు బాగు పరచడం.. బంగారు తెలంగాణ నిర్మాణం లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్న సీఎం కేసీఆర్‌పై కొందరు ప్రతిపక్ష పార్టీల నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలతో మమేకమైన కేసీఆర్‌ను బాగా ఆదరించారని.. ఆ ప్రజల రుణం తీర్చుకోవడం కోసం నిరంతరం శ్రమిస్తుంటే ఓర్వలేని కొందరు అర్ధరహితమైన ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement