breaking news
Guts
-
తూచ్... నేనలా అనలేదు!
దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్రా, దిశా పాట్నీ, అమైరా దస్తూర్... తాజాగా హ్యూమా ఖురేషి... ఈ మధ్య హాలీవుడ్ ఫ్లైట్ టికెట్ (సినిమా ఛాన్స్) తీసుకుంటున్న బాలీవుడ్ భామల జాబితా పెరుగుతూనే ఉంది. అదేంటి... హిందీ హీరోయిన్లే హాలీవుడ్ వెళ్తున్నారు. హీరోలెందుకు ఇంగ్లీష్ సినిమాల్లో నటించడం లేదనే సందేహం కొందరికి వచ్చింది! ప్రియాంకా చోప్రాని ఇదే విషయం అడగ్గా... ‘‘హాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకోవాలంటే గట్స్ (దమ్ము) కావాలి’’ అని చెప్పినట్టు ముంబయ్ మీడియాలో కొందరు రాశారు. సదరు వార్తలు చదివిన ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నేను ‘గట్స్’ అనే పదం వాడలేదని స్పష్టం చేశారు. ఈ వివాదంపై ప్రియాంక మాట్లాడుతూ –‘‘హిందీ నటులు హాలీవుడ్లో ఎందుకు నటించడం లేదని అడిగితే – ‘బహుశా... వాళ్లు అక్కడ నటించాలని ప్రయత్నించడం లేదనుకుంట’ అని చెప్పా. ‘గట్స్’ అనే పదం ఎక్కణ్ణుంచి వచ్చిందో నాకు తెలీదు. ఎప్పటిలా నా మాటల్ని వక్రీకరించారు. అనిల్ కపూర్, ఇర్ఫాన్‌ఖాన్ హాలీవుడ్లో నటిస్తున్నారు. మిగతావాళ్లూ ట్రై చేస్తే విజయం సాధించే అవకాశాలున్నాయి’’ అన్నారు. ముంబయ్ మీడియా మాత్రం ప్రియాంక మాట మార్చిందని చెబుతోంది. ఆ సంగతలా ఉంచితే, ‘‘ప్రయత్నించు.. ప్రయత్నిస్తూనే ఉండు. ఏదో రోజు విజయం సాధిస్తావ్. ప్రయత్నమే చేయకుంటే విజయం అనేది ఉండదు – నా సిద్ధాంతం ఇదే’’ అని ప్రియాంక సెలవిచ్చారు. -
దమ్మున్న పార్టీ టీఆర్ఎస్: కవిత
నిజామాబాద్: దమ్మున్న పార్టీ టీఆర్ఎస్ మాత్రమేననీ.. దమ్మున్న లీడర్ కేసీఆర్ ఒక్కరేనని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. గురువారం నిజామాబాద్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ 101 హామీలపై ఓ పార్టీ నాయకుడు పోస్టర్ వేసి ప్రచారం చేసుకోవటం దౌర్భాగ్యమని షబ్బీర్‌అలీపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన ఆమె, ఎన్నికల్లో హామీఇవ్వని వెయ్యినొక్క పనులు కేసీఆర్ చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజల బతుకులు బాగు పరచడం.. బంగారు తెలంగాణ నిర్మాణం లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్న సీఎం కేసీఆర్‌పై కొందరు ప్రతిపక్ష పార్టీల నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలతో మమేకమైన కేసీఆర్‌ను బాగా ఆదరించారని.. ఆ ప్రజల రుణం తీర్చుకోవడం కోసం నిరంతరం శ్రమిస్తుంటే ఓర్వలేని కొందరు అర్ధరహితమైన ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు.