వైద్యుల నిర్లక్ష్యం వల్ల పది రోజుల బాలుడు మృతిచెందాడని బాధితులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
వైద్యుల నిర్లక్ష్యం వల్ల పది రోజుల బాలుడు మృతిచెందాడని బాధితులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. నిర్మల్‌కు చెందిన రాములు, సంగీత దంపతుల కుమారుడికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో.. రెండు రోజుల కిందట జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాబు ఆక్సీజన్ అందక ఈ రోజు మృతిచెందాడు. ఐసీయూలో వెంటిలెటర్ మీద ఉన్న చిన్నారికి విద్యుత్ అంతరాయంతో ఆక్సీజన్ అందకపోవడంతో.. ఈ దుర్ఘటన జరిగిందని.. ఆస్పత్రిలో జనరేటర్ ఉన్నా దాన్ని వాడటంలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని.. బాధితులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపడుతున్నారు.