మంచిర్యాల మండలం వేంపల్లి గ్రామంలో తేనేటీగలు ప్రజలపై అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాయి.
మంచిర్యాల మండలం వేంపల్లి గ్రామంలో తేనేటీగలు ప్రజలపై అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాయి. గ్రామానికి చెందిన రామక్క, రాయమల్లు అనే దంపతులు బంగారు పోచమ్మ తల్లికి ఆదివారం మొక్కు తీర్చుకుంటున్న సమయంలో తేనెటీగలు ఒక్కసారిగా దాడికి దిగాయి. ఈ దాడిలో సుమారు 35 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.