ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

Tenth Student Suicide In Warangal Parvathagiri - Sakshi

పర్వతగిరి:  మండల కేంద్రం మోడల్‌ స్కూల్‌లోని వసతి గృహంలో బుధవారం మధ్యాహ్నం  మడ్డి ప్రసన్న (16) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. విద్యార్థుల కథనం ప్రకారం.. మోడల్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న ప్రసన్నను పాఠశాలలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు వ్యక్తిగత కారణాలతో తోటి విద్యార్థుల ముందు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై  వసతి గృహంలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తోటి విద్యార్థులు ప్రిన్సిపాల్‌కు తెలపటంతో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రసన్నను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించినట్లు తెలుపటంతో వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రిలోని మార్చురికి ప్రసన్న మృతుదేహన్ని తరలించారు.

శోక సంద్రంలో కుటుంబ సభ్యులు 
ప్రసన్న మృతితో తోటి విద్యార్థులు, కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. ప్రసన్న అందరితో కలివిడిగా ఉండేదని, అందరి మన్ననలు పొందుతూ చదువులో రాణించేదని విద్యార్థులు శోక సముద్రంలో మునిగిపోయారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top