తక్కువ మార్కులు వచ్చాయని.. టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య | Tenth class student commits suicide | Sakshi
Sakshi News home page

తక్కువ మార్కులు వచ్చాయని.. టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

May 19 2015 4:06 AM | Updated on Sep 3 2017 2:17 AM

తక్కువ మార్కులు వచ్చాయని..  టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

తక్కువ మార్కులు వచ్చాయని.. టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

పదవతరగతి పరీక్ష ఫలితాల్లో తక్కువ మార్కులు రావడంతో మనస్థాపం చెంది ఓ విద్యార్థిని ఆత్మహత్య

 సరూర్‌నగర్: పదవతరగతి పరీక్ష ఫలితాల్లో తక్కువ మార్కులు రావడంతో మనస్థాపం చెంది ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం సూర్యాపేటకు చెందిన జంగయ్య కుటుంబం మీర్‌పేటలోని ఓల్ట్ విలేజ్‌లో అద్దెకుంటూ కూలి పని చేసుకుంటూ జీవిస్తోంది. జంగయ్య కూతురు త్రివేణి జిల్లెలగూడలోని చల్ల లింగారెడ్డి జిల్లాపరిషత్ పాఠశాలలో టెన్త్ చదివింది. శనివారం వెలువడిన పరీక్షా ఫలితాల్లో తన స్నేహితులకు 9.5, 9.3 జీపీఏ రాగా.. త్రివేణికి 7.3 జీపీఏ వచ్చింది. స్నేహితుల కంటే తాను బాగా చదివేదాన్ని అని, తనకంటే వారికి ఎక్కువ మార్కులు వచ్చాయని అదే రోజు సాయంత్రం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. అది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే మీర్‌పేటలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement