కిరాయి సార్లు | Temporary Infrastructure arrangements | Sakshi
Sakshi News home page

కిరాయి సార్లు

Published Tue, Dec 2 2014 2:09 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

కిరాయి సార్లు - Sakshi

కిరాయి సార్లు

అనుమతుల కోసం ఇంజినీరింగ్ కళాశాలలు నా నా తంటాలు పడుతున్నాయి.

 తాత్కాలిక వసతుల ఏర్పాట్లు
‘సిబ్బంది’ కోసం ఏజెన్సీలతో ఒప్పందాలు
ఎత్తుగడలు వేస్తున్న ఇంజినీరింగ్ కళాశాలలు
తనిఖీ బృందాలను సంతృప్తి పరిచేందుకే
సుప్రీంకోర్టు ఆదేశించినా మారని యాజమాన్యాలు

నిజామాబాద్ అర్బన్: అనుమతుల కోసం ఇంజినీరింగ్ కళాశాలలు నా నా తంటాలు పడుతున్నాయి. కళాశాలలలో సౌకర్యాలను పరిశీలించేందుకు జేఎన్‌టీయూ నియమించిన కమిటీ గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తనిఖీ లను చేపడుతోంది. దీంతో యాజమాన్యాలు సౌకర్యాల క ల్పనపై దృష్టి సారించాయి. జిల్లాలో మొత్తం పది ఇంజి నీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ ఏడాది మూడు కళాశాలలకు మాత్రమే ప్రవేశాలకు అనుమతి లభించింది. తగిన వసతులు లేవంటూ మిగితా ఏడు కళాశాలలకు అనుమతిని నిరాకరిం చారు. అనంతరం ఆయా కళాశాల యజమాన్యాలు కోర్టు ద్వారా మలివిడతలో అఫిలియేషన్ సాధించినప్పటికీ, ప్రభుత్వం మళ్లీ సౌకర్యాలపై తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ కమిటీ జిల్లాకు మంగళవారం రానుంది.  దీంతో యజమాన్యాలు కమిటీని ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయాయి.
 
కమిటీ పరిశీలించేవి ఇవే
ఇంజినీరింగ్ కళాశాలకు తగిన భవన సముదాయం ఉండాలి. బాలికల కళాశాలకైతే ఐదున్నర ఎకరాలు, కో-ఎడ్యుకేషన్ అయితే పది ఎకరాల విస్తీర్ణంలో ఉండాలి. ప్రయోగశాలలు, సరిపడా బోధనా సిబ్బంది ఉండాలి. సిబ్బందికి బ్యాంకు ద్వారా వేతనాలు ఇవ్వాలి. కళాశాలలో ఉత్తీర్ణతశాతాన్ని, మౌలిక సదుపాయాలను పరిశీలిస్తారు. ఇవన్నీ సక్రమంగా ఉం టేనే విద్యార్థుల ప్రవేశాలకు అనుమతి ఇస్తారు.
 
అద్దెకు అధ్యాపకుడు

కమిటీని ప్రసన్నం చేసుకునేందుకు వీలుగా ఇంజినీరింగ్ కళాశాల యాజ మాన్యాలు అద్దె అధ్యాపకులను నియమిస్తున్నారు. కళాశాలలో వారం రోజులు లేదా కమిటీవచ్చిన రోజు బోధిస్తే ఐదు వేల నుంచి పది వేల రూపాయలు ఇస్తున్నారు. అర్హతలు ఉన్న అధ్యాపకులను హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతంలోని ఇతర ఇంజినీరింగ్ కళాశాలల నుంచి తీసుకవస్తున్నారు. రెండు ఇంజినీరింగ్ కళాశాలలు అధ్యాపకుల నియమించుకునేందుకు ఓ ఏజెన్సీతో ఒప్పందం కూడా చేసుకున్నాయని సమాచారం. కళాశాలలలో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు.

భవనాలను తీర్చిదిద్దడం, ల్యాబ్, గ్రంథాలయాలను ఆధునికరించే పనిలో పడ్డారు. తాత్కాలిక సిబ్బందిని నియమించుకున్నారు. ఇంజినీరింగ్ కళాశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి ఎన్ని నిబంధనలు రూపొందించినా, చివరికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినా యాజమాన్యాలలో మార్పు రావడం లేదు. తనిఖీల సమయంలో అధికారులను మచ్చిక చేసుకునేందుకే యత్నిస్తున్నారు తప్పితే, శాశ్వత ఏర్పాట్ల మీద దృష్టి సారించడం లేదు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా పోతోంది.
 
కన్నేసిన ఇంటెలిజెన్స్

ఇంజినీరింగ్ కళాశాలలలో తనిఖీల సందర్భంగా యాజమాన్యాల వ్యవహార శైలిపై ఇంటెలిజెన్స్ కన్నేసింది. ఉన్న సౌకర్యాలు, సిబ్బందినే చూపెడుతున్నారా, తాత్కా లిక ఏర్పాట్లు చేస్తున్నార అన్న అంశాలపై దృష్టి సారించింది. సంబంధిత కళాశాలల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. ఏ యాజమాన్యమైనా కమిటీకి తప్పుడు సమాచారం ఇచ్చినా, తాత్కాలిక ఏర్పాట్లను చూపెట్టినా, కమిటీని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించినా నివేదిక రూపొం దించి ప్రభుత్వానికి సమర్పించేందుకు ఇంటెలిజెన్స్ అధికారులు సమాయత్తమవుతున్నారు.
 
సౌకర్యాలు లేని కళాశాలలకు అనుమతి వద్దు

ఇంజినీరింగ్ కళాశాలలలో అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉంటేనే ప్రవేశాలకు అనుమతులు ఇవ్వాలి. వసతులు లేని ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతులు ఇవ్వద్దు.  తాత్కాలిక ఏర్పాట్లు చేసినా, అద్దెకు అధ్యాపకులను తీసుకవచ్చినా కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయా కళాశాలలకు భవిష్యత్తులోనూ అనుమతి రాకుండా చూడాలి.                               - శ్రీనివాస్‌గౌడ్, విద్యార్థి జేఏసీ చైర్మన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement