రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరం

Telangana State Want Alternative Political Power In MLC Elections - Sakshi

ఎమ్మెల్సీ అభ్యర్థి సుగుణాకర్‌రావు 

నిజామాబాద్‌: కాంగ్రెస్‌ ప్రలోభాలకు గురయ్యే పార్టీగా మారిపోయిందని, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ ఎదగడం ఎంతైనా అవసరమని కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్‌ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పొల్సాని సుగుణాకర్‌రావు పేర్కొన్నారు. శనివారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. మార్చి 22న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలోని పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటును బీజేపీకి వేసి గెలిపించాలని కోరారు.

రాష్ట్రంలో ఇప్పటివరకూ గెలుపొందిన కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఉండేది ఒక్క బీజేపీ ప్రజాప్రతినిధులేనని తెలిపారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, జాతీయకార్యవర్గసభ్యులు యెండల లక్ష్మీనారాయణ, నాయకులు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త, లోక భూపతిరెడ్డి, టక్కర్‌ హన్మంత్‌రెడ్డి, అల్జాపూర్‌ శ్రీనివాస్, యెండల సుధాకర్, స్వామి యాదవ్, శ్రీనివాస్‌ శర్మ పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం  
కామారెడ్డి క్రైం: జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి పొలసాని సుగుణాకర్‌రావు అన్నారు. ఆయన శనివారం కామారెడ్డిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 7 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలలోనూ బీజేపీ అధిక స్థానాలు గెలుచుకుందన్నారు.  విద్యావంతులందరూ మోదీ నాయకత్వం వైపే మొగ్గుచూపుతున్నారని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు చూస్తే కాంగ్రెస్‌ గెలిచినా, టీఆర్‌ఎస్‌ గూటికే చేరుతుందన్నారు. టీఆర్‌ఎస్‌కు సరైన ప్రత్యామ్నాయం బీజేపీయేనన్నారు. చట్టసభల్లో ప్రజల పక్షాన ప్రశ్నించే గళం బీజేపీయేనన్నారు. పట్టభద్రులు అందరు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ అభివృద్ధి కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నరాజులు, పార్లమెంట్‌ కో–కన్వీనర్‌ మోహన్‌రావు, నాయకులు ఏకే బాలాజీ, సాయిరెడ్డి, భానుప్రకాశ్, ప్రదీప్‌కుమార్, గంగాధర్, కడెం శ్రీకాంత్, పూసల రమేశ్, చంద్రంయాదవ్, సురేష్, నాగరాజు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top