తెలంగాణలోని కాకతీయ, శాతవాహన, మహాత్మాగాంధీ, తెలుగు విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులను (వైస్ చాన్స్‌లర్స్) నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణలోని కాకతీయ, శాతవాహన, మహాత్మాగాంధీ, తెలుగు విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులను (వైస్ చాన్స్‌లర్స్) నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జ్ వైస్ చాన్స్‌లర్‌గా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ టి.చిరంజీవులును నియమించింది. కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం ఇన్‌చార్జ్ వైస్ చాన్స్‌లర్‌గా విశ్రాంత ప్రొఫెసర్ (ఉస్మానియా) కె.వీరారెడ్డి నియమితులయ్యారు.
నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జ్ వైస్ చాన్స్‌లర్‌గా కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ ఎ.వాణి ప్రసాద్‌ను ప్రభుత్వం నియమించింది. ఇక, హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఇన్‌చార్జ్ వైస్ చాన్స్‌లర్‌గా విశ్రాంత ప్రొఫెసర్ (ఉస్మానియా) ఎల్లూరు శివారెడ్డి నియమితులయ్యారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ వీరిని ఉప కులపతులుగా నియమిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.