సాక్షి, హైదరాబాద్: విదేశీ యూనివర్సిటీలతో పోటీగా మనం దేశంలోని పలు యూనివర్సిటీల్లో చదువుకోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారని గడిచిన అయిదేళ్ళలో ఈ సంఖ్య రెట్టింపు అవుతూ వస్తున్నదని ఓరిక్స్ కనెక్ట్ ఎండి క్రాంతి కుమార్ అన్నారు. గురువారం జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్, యూనివర్సిటీ ప్రతినిధుల మీట్‌లో ఆయన మాట్లాడారు.

గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, ఢిల్లీలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ప్రసిద్ధి చెందిన 50కిపైగా యూనివర్సిటీల ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో పాల్గొన్నారని ఆయన తెలిపారు. ఆయా యూనివర్సిటీలలో లభిస్తున్న కోర్సులతో పాటు వాటి వల్ల ఉపాధి అవకాశాలు, భవిష్యత్‌లో చేర్చబోయే కోర్సుల గురించి కన్సల్టెంట్లకు అవగాహన కల్పించినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండి నరేందర్‌రెడ్డితో పాటు పలువురు విద్యావేత్తలు పాల్గొన్నారు.


