దీపావళి సెలవుల్లో మార్పు | Telangana Govt Change Diwali Holidays | Sakshi
Sakshi News home page

దీపావళి సెలవుల్లో మార్పు

Oct 16 2017 2:30 PM | Updated on Aug 11 2018 4:59 PM

Telangana Govt Change Diwali Holidays - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం దీపావళి సెలవుల్లో స్వల్ప మార్పులు చేసింది. మొదట ప్రకటించిన ఐచ్ఛిక సెలవు, దీపావళి సెలవులను మార్చింది. గతంలో 17న ఐచ్ఛిక సెలవు, 18న దీపావళి  సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిపై పండితులు, ఉద్యోగులు, అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పండగ సెలవు తేదీని 19కి మార్చాలంటూ పలువురు ప్రభుత్వాన్ని కోరారు.

దీంతో సెలవుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం నేడు ప్రకటించింది. ఐచ్ఛిక సెలవును 18కి, సాధారణ సెలవును 19కి మారుస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement