ఈ నెల 12న ముస్లిం ఉద్యోగులకు సగం రోజు సెలవు | Telangana Government offers Half Day leave on July 12 for Govt Iftar | Sakshi
Sakshi News home page

ఈ నెల 12న ముస్లిం ఉద్యోగులకు సగం రోజు సెలవు

Jul 10 2015 8:16 PM | Updated on Sep 3 2017 5:15 AM

తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 12 వ తేదీన ఇస్తున్న ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు వీలుగా ముస్లిం ఉద్యోగులకు సంగం దినం (హాఫ్ డే) సెలవు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 12 వ తేదీన ఇస్తున్న ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు వీలుగా ముస్లిం ఉద్యోగులకు సంగం దినం (హాఫ్ డే) సెలవు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

ఈ నెల 12 న ఉదయం పూట విధులకు హాజరై, సాయంత్రం వివిధ ప్రాంతాల్లో జరిగే ఇఫ్తార్ విందుకు హాజరు కావాలని ముస్లిం ఉద్యోగులను ముఖ్యమంత్రి కోరారు. జూలై 12 ఆదివారం అయినప్పటికీ కొన్ని శాఖల్లో, వీక్లీ ఆఫ్ విధానం పాటించే సంస్థల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులు ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు ఈ వెసులుబాటు కల్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement