సిద్ధిపేటలో మంత్రి హరీష్‌ పర్యటన

Telangana Finance Minister Harish Rao Visited dubbaka Main Canal - Sakshi

సాక్షి, సిద్ధిపేట: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు శుక్రవారం సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-12 ద్వారా దుబ్బాక కు మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు అందించే ప్రధాన కాలువను హరీష్‌ పరిశీలించారు. దుబ్బాక నియోజక వర్గంలో దాదాపు 40 కిలోమీటర్ల మేర ఈ కాలువ ఉంది. ప్రధాన కాలువ ద్వారా నీళ్లు పారుతున్న దారిని  మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, ఇరిగేషన్‌ అధికారులతో కలిసి హరీష్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొగుట మండలంలోని తుక్కాపూర్, పెద్ద మాసాన్ పల్లి, ఎల్లారెడ్డి పేట, బండారుపల్లి లో ప్రధాన కాలువ పనులు అసంపూర్ణంగా ఉండటంతో మంత్రి హరీష్‌ రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరతిగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

('పదో తరగతి పరీక్షల వ్యాజ్యంపై విచారణ చేపట్టండి')

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top