కేసీఆర్కు బర్త్ డే గిప్ట్... | telangana director shankar birthday gift to kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్కు బర్త్ డే గిప్ట్...

Feb 17 2015 1:34 PM | Updated on Aug 15 2018 9:27 PM

కేసీఆర్కు బర్త్ డే గిప్ట్... - Sakshi

కేసీఆర్కు బర్త్ డే గిప్ట్...

ముఖ్యమంత్రి కేసీఆర్కు దర్శకుడు శంకర్ బర్త్డే గిప్ట్ ఇచ్చారు. కేసీఆర్పై దర్శకుడు శంకర్ ఆడియో సీడీని రూపొందించారు.

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్కు దర్శకుడు శంకర్ బర్త్డే గిప్ట్ ఇచ్చారు. కేసీఆర్పై దర్శకుడు శంకర్ ఆడియో సీడీని రూపొందించారు. ఈ ఆడియో సీడీని డిప్యూటీ సీఎం మహమ్మద్‌ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, జగదీష్‌ రెడ్డి, ఎంపీ కవిత ఆవిష్కరించారు. శంకర్ రూపొందించిన ఆడియో సీడీలోని పాటలు అద్భుతంగా ఉన్నాయని కవిత ఈ సందర్భంగా శంకర్ను అభినందించారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత వచ్చిన  కేసీఆర్ తొలి పుట్టినరోజును పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్లో మంగళవారం కేసీఆర్ బర్త్డే సందర్భంగా తెలంగాణ భవన్లో భారీ బర్త్డే కేక్ కట్ చేశారు.  కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement