తెలంగాణ పోరాటయోధుడు బ్రహ్మానందం కన్నుమూత | Telangana combat fighter dies Brahmanandam | Sakshi
Sakshi News home page

తెలంగాణ పోరాటయోధుడు బ్రహ్మానందం కన్నుమూత

Dec 13 2014 4:28 AM | Updated on Aug 11 2018 7:54 PM

తెలంగాణ పోరాటయోధుడు బ్రహ్మానందం కన్నుమూత - Sakshi

తెలంగాణ పోరాటయోధుడు బ్రహ్మానందం కన్నుమూత

తొలిదశ తెలంగాణ పోరాటంలో చురుకైన పాత్ర పోషించిన కోదాడకు చెందిన తాటికొండ బ్రహ్మానందం(72) శుక్రవారం కోదాడలో కన్నుమూశారు.

1969 పాలేరువాగు ఘటనకు ప్రత్యక్షసాక్షి
కోదాడటౌన్: తొలిదశ తెలంగాణ పోరాటంలో చురుకైన పాత్ర పోషించిన కోదాడకు చెందిన తాటికొండ బ్రహ్మానందం(72) శుక్రవారం కోదాడలో కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.  మాజీ ఎమ్మెల్యే దివంగత కీసర జితేందర్‌రెడ్డికి కుడిభుజంగా ఉన్న బ్రహ్మనందం కోదాడ పంచాయతీ వార్డు సభ్యుడిగా కూడ పనిచేశారు.

1969లో తెలంగాణ  ఉద్యమం చురుగ్గా సాగుతున్న తరుణంలో కొందరు ఆంధ్రపాంతం వారు కోదాడపై దాడికి యత్నించారు. దీంతో జితేందర్‌రెడ్డి  పాలేరువాగుపై కాల్పులు జరిపారు. దీంతో వారు వెనుదిరిగిపోయారు. ఈ సంఘటనకు బ్రహ్మానందం ప్రత్యక్షసాక్షి. ఆయన మృతిపట్ల 1969 పోరాట యోధుల కమిటీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. పలువురు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు, టీఆర్‌ఎస్ నియెజకవర్గ ఇన్‌చార్జ్ శశిధర్‌రెడ్డి ఆయనకు నివాళులర్పించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement