నేటి తెలంగాణ అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై చర్చ | telangana assembly meet today | Sakshi
Sakshi News home page

నేటి తెలంగాణ అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై చర్చ

Nov 10 2014 8:12 AM | Updated on Sep 29 2018 7:10 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభం కానున్నాయి.

హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభం కానున్నాయి.శుక్రవారం సభను విపక్షాలు అడ్డుకోవడంతో సోమవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. నేటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా రైతు ఆత్మహత్యలు, విద్యుత్ సంక్షోభంపై చర్చించనున్నారు. ఉదయం పది గంటలకు ప్రారంభకానున్న అసెంబ్లీ సమావేశంలో తొలుత బడ్జెట్ పై చర్చించనున్నారు. చర్చకు అధికార, విపక్షాలు సిద్ధమవుతున్నాయి.

 

టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆత్మహత్యలు పెరిగాయాంటూ నిలదీసేందుకు కాంగ్రెస్, టీడీపీలు సన్నద్ధమవుతున్నాయి. ప్రతిపక్షాలపై ఎదురుదాడికి అధికారపక్షం వ్యూహ రచన చేస్తోంది. ఇందుకు సంబంధించి ముందుగా టీఆర్ఎస్ వ్యూహరచన కమిటీ సమావేశం కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement